రవితేజ యాక్షన్‌తో డ్రామాగా రూపొందిన చిత్రం ఖిలాడి ఈ నెల 11న విడుదల కానుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ సినిమాలోని పాటలు అనుకున్నంతగా అయితే క్లిక్కవ్వలేదు. ఇక సంగీతం గురించి దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ.. డిఎస్పీ కథ విన్న వెంటనే కేవలం ఒక్క గంట వ్యవధిలో సినిమాకు సంబంధించిన మొత్తం ఆరు ట్యూన్స్ ఇచ్చారని చెప్పారు.
ట్యూన్ ఇచ్చిన తరువాత తాను షాక్ అయ్యానని, అయితే సినిమాలో ఐదు మాత్రమే ఉపయోగించామని రమేష్ వర్మ చెప్పారు. ఇక ఈ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వెలువడుతున్నాయి. దేవి సంగీతం అందించడంలో కొంతమంది హీరోలకు అనుకున్నంతగా న్యాయం చేయలేకపోతున్నారని ముఖ్యంగా సుకుమార్ సినిమాలకు తప్పితే మిగతా సినిమాలకి అంతంత మాత్రంగానే ట్యూన్స్ ఇస్తున్నట్లు ట్రోల్ చేస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment