జనగణమన స్టోరీ లైన్ ఇదేనా?


పూరి జగన్నాథ్ టాప్ డైరెక్టర్ గా గతంలో కొన్ని బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు, అతను విజయ్ దేవరకొండ కథానాయకుడిగా కొత్త చిత్రం లైగర్‌తో సిద్ధంగా ఉన్నాడు. సినిమా షూటింగ్ కూడా పూర్తయియ్యింది. ఇక లైగర్‌తో పాటు పూరి విజయ్‌తో జన గణ మన సినిమా కూడా చేయనున్నాడు.

ఇక త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ మేన్‌గా కనిపించనున్నాడని టాక్ వస్తోంది. ఊహాగానాల ప్రకారం.. ఈ చిత్రం అవినీతి రాజ్య నేపథ్యంలో సాగుతుందట. నాయకులు పాలనలో విఫలమైనప్పుడు, ఒక సైనిక అధికారి ముందుకు వచ్చి నాగరిక పద్ధతిలోనే వాటిని సెట్ చేస్తాడట. ఇది ఊహాగానాలే అయినప్పటికీ, ఈ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుందని సమాచారం.

Post a Comment

Previous Post Next Post