వరుణ్ తేజ్ ఇప్పటివరకు ఎంచుకున్న సినిమాల తీరు వేటికవే విభిన్నంగా ఉన్నాయి. ‘అంతరిక్షం’ లాంటి కొన్ని సినిమాలు పరాజయం పాలైనప్పటికీ, కొత్తగా ప్రయత్నించి మెప్పించాడు. ఇక వరుణ్ మరోసారి తన కెరీర్ లోనే ఓ డిఫరెంట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ ఒక పెద్ద పాన్-ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.
ఇక తదుపరి పాన్-ఇండియా ప్రాజెక్ట్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. వరుణ్ మొదటి పాన్-ఇండియా చిత్రం బాలాకోట్ వైమానిక దాడులపై ఆధారపడి ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడట.
బాలాకోట్ వైమానిక దాడి అంటే.. భారత యుద్ధ విమానాలు 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిక్షణా శిబిరానికి వ్యతిరేకంగా బాంబు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment