మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ సినిమా తర్వాత మరొక పెద్ద స్టార్ హీరోతో సినిమా చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అతను ముందు అనుకున్న కమిట్మెంట్ ప్రకారం ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండే విధంగా కథను రెడీ చేసుకుంటున్నాడు.
సినిమాకు సంబంధించి అనేక రకాల కథనాలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేశారు అనే విషయంలో కూడా ఒక టాక్ అయితే వస్తుంది. బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ పరిణితి చోప్రా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శకుడు వారి మేనేజర్స్ ద్వారా సంప్రదింపులు మొదలు పెట్టినట్లు టాక్. అయితే ఇంకా బ్యూటీ ఫైనల్ కథను వినలేదని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment