లైగర్.. పుష్ప కంటే ఎక్కువగా?


విజయ్ దేవరకొండ మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ లైగర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక సినిమా ఓటీటీ హక్కులను ఇటీవల అమెజాన్ ప్రైమ్ 60కోట్లకు అందుకున్నట్లు సమాచారం.

ఇక సినిమాకు నాన్ థియేట్రికల్ గా పుష్ప కంటే ఎక్కువ డీల్స్ అందుతున్నట్లు సమాచారం. పుష్ప ఓటీటీ హక్కులు 40కోట్లకు మాత్రమే అమ్ముడవ్వగా ఇప్పుడు లైగర్ అంతకంటే ఎక్కువ రేటులో అమ్ముడవ్వడం విశేషం. శాటిలైట్ హక్కులు కూడా భరిగానే అమ్ముడయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక థియేట్రికల్ గా సినిమా ఇంకా ఏ స్థాయిలో బిజినెస్ చేస్తుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post