రాధేశ్యామ్ కోసం మరో బిగ్ ప్లాన్?


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక నటించిన ఈ సినిమా సంక్రాంతి నుంచి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక మార్చి 11వ తేదీన రానున్న ఈ సినిమా కోసం మరోసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు.  సాంగ్ అప్‌డేట్‌తో పాటు మరికొన్ని రోజుల్లో సెకండ్ ట్రైలర్ ని విడుదలా చేయాలని చూస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ మార్చి మొదటి వారంలో ముంబైలోనే మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేసింది.  ఇప్పటివరకు, ఈ ఈవెంట్‌కు సంబంధించి అధికారిక సమాచారం లేదు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వస్తుందని సమాచారం. ఇక ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post