రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ఒక హస్తసాముద్రికుడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. సినిమాలో అతను వరల్డ్ గ్రేటెస్ట్ పామిస్ట్ విక్రమాదిత్యగా అలరించబోతున్నాడు. తప్పకుండా సినిమాలోని పాత్ర అంచనాలను అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు నమ్ముతున్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సినిమాలో విక్రమాదిత్య పాత్రను నిజజీవితంలోని ఐరిశ్ పామిస్ట్ ఆధారంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అతని పేరు చెరో పూర్తి పేరు విలియం జాన్ వార్నర్. అతను భారతదేశంలో కొంకణ్ ప్రాంతంకు చెందిన హస్తసాముద్రికం నేర్చుకున్నాడట. ఆ తరువాత అతను లండన్‌లో స్థిరపడ్డాడు. ఇక అక్కడ అతనికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. రాధేశ్యామ్ చివరి 20 నిమిషాల కథ లండన్‌లోనే కొనసాగుతుంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment