ఆస్కార్ విన్నట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్.రెహమాన్ తెలుగు సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. 2016లో చివరగా నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో.. అనే సినిమా చేశాడు. అనంతరం ఆయన తమిళ్ సినిమాలు ఎక్కువగా తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. ఇక ఆ మధ్య సైరా సినిమాకు సెలెక్ట్ అయినప్పటికీ బిజీగా ఉండడం వలన చేయలేకపోయారు.
ఇక త్వరలో స్టార్ట్ కాబోయే ఎన్టీఆర్ - బుచ్చిబాబు సినిమా కోసం ఏఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించే అవకాశం ఉందట. అలాగే పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోయే జనగణమన కోసం కూడా మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ ఉందట. ఈ రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగానే తరపైకి రానున్నాయి. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment