మరోసారి రానా ఘాజి కాంబినేషన్?


ఘాజి సినిమాతో సోలోగా బాక్సాఫీస్ హిట్ అందుకున్న రానా దగ్గుబాటి మళ్ళీ ఆ తరువాత సరైన సక్సెస్ చూడలేదు. ఆ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక మళ్ళీ చాలా కాలం తరువాత ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

సంకల్ప్ రెడ్డి ఘాజి అనంతరం అంతరిక్షం అనే సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ మధ్య పిట్టకథలు వెబ్ సీరీస్ లో ఒక వెర్షన్ కు డైరెక్ట్ చేశాడు. బాలీవుడ్ నుంచి కూడా సంకల్ప్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే మరోసారి రానా కోసం ఆ యువ దర్శకుడు కథ సెట్ చేసినట్లు టాక్. మరి ఈ కాంబినేషన్ పై ఎప్పుడు అఫీషియల్ గా ప్రకటన ఇస్తారో చూడాలి. ప్రస్తుతం రానా విరటపర్వం సినిమా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post