ఇలాయనా మరో షాకింగ్ లుక్


పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఇలియానా ఆ తరువాత కొన్నాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది. సీనియర్ హీరోలతోనే కాకుండా యువ హీరోలతో కూడా జతకట్టి అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే మెల్లగా ఆమె రేంజ్ తగ్గుతూ వచ్చింది. చివరగా రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇక సినిమా అవకాశాలు తగ్గిన అనంతరం ఇలియానా చాలా బొద్దుగా మారిపోయింది. ఇటీవల ఆమె ఎడిట్ చేయని ఫొటో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. మొబైల్ యాప్స్ తో ఈ రోజుల్లో చాలామంది వారు సన్నగా కనిపించే విధంగా ఫొటోలు పోస్ట్ చేస్తున్నారని అయితే తాను మాత్రం అలాంటి యాప్స్ వాడడం లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఏదేమైనా ఇలియానా ఈ లుక్ లో కూడా బావుందని అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post