స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ రాబోయే OTT షో తెలుగు ఇండియన్ ఐడల్‌కి న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాడు. ఈ వార్త చాలా రోజులుగా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుండగా ఈ రోజు, ఆహా వీడియో అదే విషయాన్ని ధృవీకరించడానికి ఒక ప్రోమోను విడుదల చేసింది. ఇండియన్ ఐడల్ 5 విజేత శ్రీరామ చంద్ర ఈ మ్యూజిక్ రియాలిటీ షోను హోస్ట్ చేయనున్నారు.
ఇక ఈ OTT షోకి న్యాయనిర్ణేతలలో నటి నిత్యా మీనన్ కూడా ఒకరని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఆ వార్తలకు సంబంధించి మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇండియన్ ఐడల్ యొక్క తెలుగు వెర్షన్ త్వరలో ఆహాలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇక ప్రస్తుతం థమన్ RC15, థాంక్యూ, గాడ్‌ఫాదర్ వంటి వాటికి సంగీతం సమకూర్చడంలో బిజీగా ఉన్నాడు. మహేష్ సర్కారు వారి పాట సినిమాతో పాటు త్రివిక్రమ్ SSMB28 ప్రాజెక్ట్ కి కూడా సంగీతం అందించనున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment