టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ తో సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐపీఎస్ అధికారిగా మాత్రమే కాకుండా ఒక పవర్ ఫుల్ పొలిటిషయన్ గా కూడా కనిపిస్తాడని తెలుస్తోంది.
మూడు విభిన్నమైన షేడ్స్ లో రామ్ చరణ్ ను శంకర్ ప్రజెంట్ చేయబోతున్నాడట. అయితే రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ ఖద్దరు చొక్కా లో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చాలా హుందాగా గా కనిపిస్తాడని సమాచారం. నేటితరం సమాజంలోని చాలా కఠినమైన లోపాలను సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Follow @TBO_Updates
Post a Comment