జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయాలని అనుకున్నట్లుగా ఇటీవల ఒక నిర్మాత తెలియజేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా, నితిన్ తో సినిమా నిర్మించిన ఆవుల గిరి కొన్నేళ్ల క్రితం పలు సినిమాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఒక సమయంలో రాణా ప్రతాప్ జీవితం ఆధారంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ను చిరంజీవి ని హీరోగా పెట్టి సినిమా చేయాలని అనుకున్నట్లుగా తెలియజేశాడు.
అయితే ఒక వ్యక్తి కారణంగా ఎన్టీఆర్ కు తనకు మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది అని ఆ తర్వాత నిజం తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ వ్యక్తిని మూడు రోజులు గదిలో పెట్టి కొట్టినట్లుగా తెలియజేశాడు. అంతేకాకుండా కొడాలి నాని కూడా నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి కూడా ఆ వ్యక్తిని కొట్టినట్లుగా తెలిపారు. ఇక ఆ తర్వాత సినిమా చేయడానికి ఎన్టీఆర్ మెగాస్టార్ తో కూడా మాట్లాడుకోవడం జరిగిందని అన్నారు. కానీ కొన్ని బిజినెస్ కారణాల వలన ఆ ప్రాజెక్టు నుంచి నేను తప్పుకోవాల్సి వచ్చిందని ఆ విధంగా మల్టీస్టారర్ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా గిరి తెలియజేశాడు.
Follow @TBO_Updates
Post a Comment