ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ , జూనియర్ ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ కూడా అదే తరహాలో అడుగులు వేస్తున్నారు. త్వరలో మహేష్ బాబు కూడా అదే తరహాలో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు.
ఒక్కసారి పాన్ ఇండియా సినిమాలు చేస్తే మళ్లీ అదే తరహాలో అడుగులు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు కథను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సెట్ చేసిన తర్వాతనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా ప్రస్తుతం అదే తరహాలో సినిమాలు ఒప్పుకుంటున్నాడు. లోకల్ కథలు వస్తే రిజెక్ట్ చేస్తున్నాడట శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఇక అల్లు అర్జున్ ఐకాన్ కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా సెట్ అవటం లేదు అని ఆ ప్రాజెక్టును పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా రానున్న రోజుల్లో మాత్రం స్టార్ హీరోలు కాంటిన్యూగా పాన్ ఇండియా సినిమాలనే చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment