పునీత్ ఆఖరి సినిమా కోసం మెగా, నందమూరి హీరోలు


కన్నడ పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న పునిత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి సినిమా జేమ్స్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పనులన్ని ముగిసిన క్షణంలో పునీత్ మరణించాడు. కేవలం కొంత డబ్బింగ్ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా హై టెక్నాలజీతో షూటింగ్ స్పాట్ లో చెప్పిన డైలాగ్స్ ను సినిమాలో మిక్స్ చేశారు. 

ఇక హార్ట్ ఎటాక్ తో మరణించిన పునీత్ కు దాదాపు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అందరి హీరోలు కూడా ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఇక పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ సినిమాను మార్చి 17వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు డిసైడ్ అయ్యారు. అయితే పునీత్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా నందమూరి హీరోల ప్రత్యెక అతిధులుగా రానున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జేమ్స్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చి 6వ తేదీన నిర్వహించబోతున్నారు.


Post a Comment

Previous Post Next Post