భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కక్ష సాదింపు చర్యలు చూపిస్తుంది అనేది అందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ సినిమాలో చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థులకు బలమైన కౌంటర్ ఇస్తున్నాడా అని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలపై ప్రత్యర్థి నాయకులు ఏ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పవన్ భీమ్లా నాయక్ లో "శుక్రవారం వచ్చి సంతకం పెట్టరా నా కొడకా.." అనే డైలాగ్ కూడా కౌంటర్ ఇచ్చే విధంగానే ఉంది అని చెప్పవచ్చు. బాలకృష్ణ తన సినిమాల్లో చాలాసార్లు ప్రత్యర్థులకు కౌంటర్స్ ఇవ్వగా ఇప్పుడు అంతకుమించి అనేలా పవన్ కూడా కౌంటర్స్ ఇస్తున్నాడు అనిపిస్తోంది. ఏదేమైనా భీమ్లా విడుదలవ్వడంతో ఏపీ గవర్నమెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా అర్ధమవుతోంది.
Follow @TBO_Updates
Post a Comment