రాధేశ్యామ్.. వాయిస్ ఓవర్ ఐడియా ఎవరిదంటే?


రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రస్తుతం ఇండియా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా తన మార్కెట్ ను పెంచుకుంటున్న డార్లింగ్ తదుపరి సినిమా రాధేశ్యామ్ తో కూడా మంచి విజయాన్ని అందుకుంటాడు అని ప్రేక్షకులలో నమ్మకం అయితే ఏర్పడింది. అయితే ఈ సినిమాలో వాయిస్ ఓవర్ చాలా ముఖ్యం కానుందని హిందీలో అమితాబ్ బచ్చన్ ను రంగంలోకి దింపుతున్నారు.

అలాగే తెలుగులో మహేష్ బాబు కూడా చెబుతాడని టాక్ అయితే వస్తుంది కానీ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఇక ప్రభాస్ ద్వారానే అమితాబచ్చన్ రాధేశ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట ప్రభాస్ తోనే వాయిస్ ఓవర్ ఇప్పించారు. సంక్రాంతికి విడుదల అయ్యి ఉంటే అమితాబ్ వాయిస్ ఉండేది కాదు. కాస్త ఆలస్యం కావడంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేయాలి అని దర్శకుడు వాయిస్ ఓవర్ ను ఇతర హీరోలతో చెప్పిస్తే బాగుంటుంది అని అన్నాడట  దీంతో ప్రభాస్ మరో ఆలోచన లేకుండా హిందీలో అమితాబ్ బచ్చన్ అని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు విషయంలో అయితే ఇంకా ఫైనల్ క్లారిటీ రాలేదు.


Post a Comment

Previous Post Next Post