త్రివిక్రమ్‌కి కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా తన సినిమాలకు ‘ఎ’ అనే అక్షరంతో టైటిల్ పెట్టడం తెలిసిందే. అదే విధంగా బ్రహ్మానందం పాత్రను కూడా ఎదో ఒక విధంగా హైలెట్ చేస్తున్నాడు. కనీసం తన సినిమాలో ఒక పాటలో అయినా అతనిని చూడాలని కోరుకుంటాడు. అత్తారింటికి దారేది తర్వాత సెంటిమెంట్ మరింత బలపడింది. భీమ్లా నాయక్ సినిమాకు కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగించాడు.
ఇక అయ్యప్పయుం కోజియుమ్‌లో ఏ కమెడియన్‌కు స్కోప్ లేకపోయినా, ఇక్కడ భీమ్లా నాయక్‌లో బ్రహ్మానందం కోసం ఒక పాత్ర సృష్టించబడింది. గత కొంత కాలంగా బ్రహ్మానందం పవర్ ఫుల్ కామెడీ పాత్రలు చేయలేదు. మరి భీమ్లా నాయక్ తో ఆ లోటు తీరుతుందేమో చూడాలి. భీమ్లా నాయక్ సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇక సోమవారం జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి మరణించిన కారణంగా వాయిదా పడింది.
Follow @TBO_Updates
Post a Comment