నెట్‌ఫ్లిక్స్ సౌత్ OTT మార్కెట్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. గత కొంతకాలంగా వారు తెలుగు స్టార్స్ తో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు, నెట్‌ఫ్లిక్స్ మరో ఆసక్తికరమైన OTT ప్రాజెక్ట్‌ను లైన్ లో పెట్టేందుకు సిద్ధమైనట్లు టాక్ వస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ RRR స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఒక బిగ్ వెబ్ సిరీస్‌ను రూపొందించాలని యోచిస్తోందట. చరణ్‌కు ఆ వెబ్ సిరీస్‌కి సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారట.
అయితే ప్రస్తుతం రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ తరువాత గౌతమ్ తిన్ననూరితో మరొక స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు. మరి నెట్ ఫ్లిక్స్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment