శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ మరో డిఫరెంట్ మూవీ?


ట్యాక్సీ వాలా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ సంకృత్యాన్ రెండవ సినిమా శ్యామ్ సింగరాయ్ తో మరో బిగ్ హిట్ అందుకున్నాడు. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ పిరియాడిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అంధించడమే కాకుండా ఓటీటీలో కూడా రికార్డు దిశగా వ్యూవ్స్ అందుకుంటోంది.
ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో టాప్ 3 ట్రేన్డింగ్ లో నిలవడం విశేషం.

ఇక శ్యామ్ సింగరాయ్ సక్సెస్ తో రాహుల్ కు ఇండస్ట్రీలో డిమాండ్ ఏర్పడింది. ఈ యువ దర్శకుడితో సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక రాహుల్ తన తదుపరి సినిమాను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చే అవకాశం ఉందట. ఇక హీరోగా నాగచైతన్య ఫిక్స్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చైతు థాంక్యూ ప్రాజెక్ట్ తో పాటు వెబ్ సీరీస్ అలాగే మరొక ప్రాజెక్ట్ కు కమిట్మెంట్ ఇచ్చాడు. ఇక రాహుల్ సినిమాపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు టాక్. మరి చైతన్య ఆ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post