రాజమౌళి - అల్లు అరవింద్ కాంబో?


దర్శకధీరుడు రాజమౌళి “మగధీర” లాంటి సినిమాని తీసుకురావడానికి అప్పట్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించారు.  ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ, ఈ ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేయలేదు.
అప్పట్లో అరవింద్‌తో రాజమౌళి మనస్తాపానికి గురయ్యాడని, అందుకే మళ్లీ కలిసి చేయలేదని ఓ టాక్‌ వచ్చింది.  అయితే ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్ లెజెండరీ డైరెక్టర్‌తో  కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

పుష్పతో ఐకాన్ స్టార్ కూడా దూసుకుపోతుండడంతో ప్రస్తుతం అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా తీయాలని అరవింద్ భావిస్తున్నాడని అంటున్నారు. గీతా ఆర్ట్స్, రాజమౌళి కలిసి ఓ సినిమా చేస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు మాత్రం అల్లు అరవింద్ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు సినిమాను ముగించిన తర్వాత అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా ఛాన్స్ ఉంటుందట. మరి ఇది ఎప్పుడు అధికారికంగా వస్తుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post