టీవీ సీరియల్ కోసం ఏకంగా రూ.130కోట్లు


రోజురోజుకు అనేక కొత్త ప్లాట్‌ఫారమ్‌లు వెలువడుతున్న తరుణంలో బడ్జెట్ లెక్కలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
టెలివిజన్ షోల విషయానికి వస్తే హిందీలో కూడా సీరియల్స్ బడ్జెట్ అమాంతం పెరిగిపోతున్నాయి. సాధారణంగా టీవీ షోల బడ్జెట్ విషయంలో పెద్దగా వార్తలు రావు. అయితే ఒక టెలివిజన్ షో కోసం మాత్రం ఏకంగా 130కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారట.
ఏక్తా కపూర్ డ్రామా క్విన్ ఇప్పుడు ప్రముఖ షో నాగిన్ సరికొత్త సీజన్‌తో తిరిగి వచ్చింది.  ఈ షోలో బిగ్ బాస్ 15 విజేత తేజస్విని ప్రకాష్ మెయిన్ లీడ్‌గా నటించనున్నారు.
ఇప్పుడు ఏక్తా ఈ షోను 130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని టాక్.  భారతీయ టెలివిజన్ షోలతో ఇప్పటి వరకు ఎవరు కూడా సీరియల్స్ కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయలేదు. త్వరలోనే మొదలు కానున్న 6వ సీజన్ లో గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకుంటాయని సమాచారం.

Post a Comment

Previous Post Next Post