నాని సినిమా కోసం 12 కోట్ల పల్లెటూరు?


నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న దసరా సినిమాలో నాని ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల్  కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా విభిన్నంగా ఉంటుందట. సినిమా కథ తెలంగాణ గోదావరిఖనిలోని సింగరేణి కోల్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో సాగుతుంది.

ఇక సినిమా కోసం భారీ స్థాయిలో విలేజ్ సెట్ ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న 12 ఎకరాల స్థలంలో ఒక పల్లెటూరి వాతావరణంలో సెట్‌ను నిర్మిస్తున్నారట. ఆ సెట్‌తో సింగరేణి ప్రాంతానికి తగ్గట్టుగా ఉంటుందట. ఆ సెట్ కోసం కోసం మేకర్స్ దాదాపు 12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇదివరకే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో టెంపుల్ సెట్ ను భారీగా ఖర్చు చేసి నిర్మించగా ఇప్పుడు అదే తరహాలో దసరా సినిమా కోసం అదే ఆర్ట్ డైరెక్టర్ సెట్ ను నిర్మిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post