నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ జనవరి 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. థియేటర్లలో విజయవంతమైన ఈ చిత్రం OTT లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇది ప్రపంచ రికార్డులలో కూడా నిలిచింది. జనవరి 17 మరియు 23 మధ్య, శ్యామ్ సింగ రాయ్ 3,590,000 వ్యూవ్స్ హావర్స్ ను పొందినట్లు తెలుస్తోంది
నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన మూడవ చిత్రం కావడం విశేషం. సోషల్ మీడియాలో కూడా సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. యువ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ విజన్ కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు. ఇక థియేట్రికల్ గానే కాకుండా OTT తో కూడా నాని చాలా కాలం తరువాత మంచి విజయాన్ని అందుకున్నాడు. అతని నుంచి చివరగా వచ్చిన డైరెక్ట్ ఓటీటీ మూవీస్ V, టక్ జగదీష్ సినిమాలు నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.
Follow @TBO_Updates
Post a Comment