RRR ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?


కరోనా దెబ్బ తో మరోసారి సినిమా ప్రపంచం కన్ఫ్యూజన్  లో పడింది అంత సెట్ అయింది. జనవరి నుంచి మళ్లీ కొత్త సినిమాలో హడావిడిగా ఇండస్ట్రీ పుంజుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఎప్పటిలాగానే కరోనా ఆంక్షలతో సినిమాలు థియేటర్స్ లోకి రావడానికి భయపడుతున్నాయి. ఇక RRR సినిమా కూడా వాయిదా పడింది.


పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 50% ఆక్యుపెన్స్ తో థియేటర్స్ నడవబోతున్నాయి. ముందు ముందు ఇంకా ఎలాంటి పరిస్థితులు దర్శనమిస్తాయో చెప్పడం కష్టం. ఢిల్లీలో అయితే పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఉంటుంది. ఇక కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో థియేటర్స్ 50% ఆక్యుపెన్స్ తో నడవనున్నాయి. ఇక ఇప్పుడు సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని ఏప్రిల్ కి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. కానీ అప్పుడు కూడా పోటీ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post