కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా వంటి అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఆక్యుపెన్సీ పరిమితులను విధించాయి. హిందీ చిత్రాలకు అతిపెద్ద మార్కెట్ అయిన ముంబైలో ఇప్పటికే 144 సెక్షన్‌ను జనవరి 15 వరకు పొడిగించారు. ఈ సమయంలో రాధే శ్యామ్ నిర్మాతలకు కేవలం రెండు ఛాన్స్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
RRR తరహాలోనే విడుదలను వాయిదా వేయాలి. లేదా చేతిలో ఉన్న టెంప్టింగ్ OTT ఆఫర్‌ల కోసం డీల్ సెట్ చేసుకోక తప్పదు. ప్రస్తుతం ఒక ఓటీటీ సంస్థ 300కోట్ల డీల్ సెట్ చెసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక యూవీ క్రియేషన్స్ మాత్రం 350కోట్ల టార్గెట్ తో ఉన్నట్లు సమాచారం. ఆ రెండు ఆప్షన్స్ కాకుండా జనవరి 14న సినిమాను విడుదల చేస్తే మాత్రం చేతులరా సినిమాతో నష్టాలపాలు కావాల్సిందే. మరి చిత్ర యూనిట్ సభ్యులు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment