నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా చేస్తున్న ఆహా అన్‌స్టాపబుల్ షోకు మంచి క్రేజ్ అందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ షోలోకి మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ప్రత్యేక అతిధులుగా వస్తున్నారు. బాలయ్య మిగతా హీరోలతో ఎంత సాన్నిహిత్యంగా ఉంటారో ఈ షోను చూస్తేనే ఈజీగా అర్ధమవుతోంది.
ఇక రౌడి స్టార్ విజయ్ దేవరకొండ కూడా అన్‌స్టాపబుల్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. నేడు షూటింగ్ కూడా జరగనున్నట్లు సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండలతో బాలకృష్ణ మంచి ఎంటర్టైన్మెంట్ అంధించనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే వీరిని షోలోకి రప్పించాలని అనుకున్నారట. కానీ లైగర్ సినిమాతో బిజీగా ఉండడం వలన రాలేకపోయారు. ఇక నేడు జరగబోయే షూట్ ఎప్పుడు ఆహాలో సందడి చేస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment