'Hero' Movie @ Review


కథ:
అర్జున్ (అశోక్ గల్లా) సినిమా హీరో కావాలని చాలా ప్రయత్నాలు చేసే మధ్యతరగతి యువకుడు. అయితే  అర్జున్ పొరపాటున కొరియర్ ద్వారా తుపాకీ రావడంతో..  దాని గురించి కనుగొనడానికి తిరిగి చేసిన ప్రయత్నాలు ముంబై మాఫియాతో కొత్త సమస్యలను తెస్తాయి. అసలు ఆ గన్ ఎవరు పంపారు? నిధి అగర్వాల్ , జగపతిబాబు హీరోకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తారు? మాఫియాను హీరో ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగిలిన కథ

విశ్లేషణ:
కథ మేయిన్ ప్లాట్ సినిమా నేపథ్యం కావడంతో అగ్ర హీరోలందరిపై ప్రత్యేకించి హైలెట్ చేశారు. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ బాబుల గురించిన రిఫరెన్స్‌లు పుష్కలంగా ఉన్నాయి. అశోక్ గల్లాను హీరోని లాంచ్ చేయడానికి లవ్ స్టోరీ లేదా మాస్ ఫ్లిక్‌ని ఎంచుకోవడం కంటే.. టీమ్ ఎక్కువగా బీట్ కామెడీ జానర్‌ను ఎంచుకుంది. అశోక్ గల్లా అర్జున్‌గా పర్వాలేదు అనే విధంగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ పాత్ర పెద్దగా పెర్‌ఫార్మెన్స్‌ని డిమాండ్ చేయదు కాబట్టి మనోడు యాక్షన్ డ్యాన్స్ లపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు అనిపిస్తుంది.  

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఒక డిఫరెంట్ కామెడీ చిత్రాన్ని అందించడానికి ప్రయత్నించారు. ఇక మధ్యలో కామెడీ ట్రాక్స్ యాక్షన్ సీన్స్ కొన్ని గందరగోళంగా ఉంటాయనే ఫీలింగ్ ను కలిగిస్తుంది. కథ విషయంలో అన్ని చాలా ఈజీగా జరిగిపోతు ఉంటాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలు కూడా ఓకే. ఫాస్ట్ గా వెళ్లే స్క్రీన్‌ప్లేతో సాదారణ కామెడీ ప్రయత్నాలతో హీరో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో ఒక నార్మల్ పాయింట్‌ని క్లైమాక్స్‌ వరకు లాగారు అనిపిస్తుంది.  సీనియర్ సినిమా హీరోగా బ్రహ్మాజీ పాత్ర మాత్రమే సినిమాలో మేజర్ హైలెట్ అని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ లో ఊరమాస్ అనేలా బాగానే ట్రై చేశారు.
 
అశోక్ గల్లా హీరోగా క్లిక్కవాలని బాగానే హార్డ్ వర్క్ చేసినట్లు కసి కనిపించింది. సినిమాలో అయితే పెర్ఫార్మెన్స్ చేయడానికి పెద్దగా స్కోప్ లేదు కాబట్టి కామెడీ ట్రాక్ లతో బాగానే ఆకట్టుకున్నాడు. జగపతిబాబు పాత్రపై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సి ఉండేది. హీరోయిన్ నిధి అగర్వాల్‌ పాత్ర అంత మేజర్ హైలెట్ ఏమి కాదు. వెన్నెల కిషోర్ పాత్ర పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.  కమెడియన్ సత్య కూడా అంత కొత్తగా ఏమి కనిపించలేదు.

ప్లస్ పాయింట్స్:
👉యాక్షన్ ఎపిసోడ్స్
👉సాంగ్స్
👉కొన్ని కామెడీ సీన్స్

నెగిటివ్ పాయింట్స్:
👉అసలు పాయింట్ ను సాగదీయడం
👉సెకండ్ హాఫ్ లో విసిగించే సీన్స్
👉రొటీన్ ట్రాక్స్

Rating: 2.5/5

Post a Comment

Previous Post Next Post