నేచురల్ స్టార్ నాని, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా రాబోయే సినిమా అంటే సుందరానికి, దసరా సినిమాలపై కూడా నాని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రస్తుతం ఆ రెండు సినిమాల షూటింగ్స్ అయితే చాలా వేగంగా కొనసాగుతున్నాయి.
ఇక శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న దసరాలో నాని పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. ఈ నటుడు అనేక గ్రే-షేడ్స్‌తో యాంటీ-హీరో పాత్రను పోషించనున్నాడని తాజా సమాచారం. అలన పవర్ఫుల్ నెగిటివ్ షేడ్స్ లో దర్శనమిస్తాడని తెలుస్తోంది, నాని ప్రతినాయకుడిగా నటించడం కొత్తేమీ కాదు. జెంటిల్‌మన్, వి వంటి సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్‌లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఓమిక్రాన్ భయాల మధ్య, దసరా షూటింగ్ కు బ్రేకులు పడుతుండడంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment