మెగా ప్రొడక్షన్ లో కృతిశెట్టి బిగ్ ప్రాజెక్ట్?


ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి శ్యామ్ సింగరాయ్ తో వరుసగా రెండవ హిట్ సాధించింది. ఇక బంగార్రాజుతో కూడా హిట్ కొట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కృతి శెట్టి వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేయడంలో బిజీగా ఉంది.  ఇప్పటికే ఆమె ఈ ఏడాది విడుదల కానున్న రామ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.  

తాజా అప్‌డేట్ ప్రకారం, కృతి శెట్టి ఇటీవల మెగా ఆఫర్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించనున్న ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఉయ్యాల జంపాలా, మజ్ను వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ ఈ ఉమెన్ సెంట్రిక్ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. యూత్ ను ఆకట్టుకునే ఆ సినిమాలో మోడ్రన్ టచ్ ఉంటుందట. ఇక కృతి శెట్టి తన కెరీర్‌లో ఒక చాలా వేగంగా లేడి ఓరియెంటెడ్ సినిమా చేయబోతోంది. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post