సాధారణంగా ఒక హిట్ వస్తే ఇటీవల కాలంలో హీరోయిన్స్ కు వెంటనే రెండు మూడు సినిమాలను రావడం సహజం. అయితే అఖండ లాంటి సక్సెస్ వచ్చినా కూడా ప్రగ్యా జైస్వాల్ సరైన ఛాన్స్ లు అందుకోవడం లేదు. గ్లామర్ ప్రజెంటేషన్ లో అమ్మడు ఏ మాత్రం హద్దులు చూపదని ఇన్స్టాగ్రామ్ పై ఒక లుక్కేస్తేనే అర్ధమవుతుంది.
నిజానికి అఖండ సక్సెస్ మొత్తం బాలకృష్ణ, బోయపాటి , థమన్ ఖాతాలో పడిందనే చెప్పాలి. జై బాలయ్య అన్నా కూడా ప్రగ్యా గురించి ఎక్కువ రోజులు ఎవరు కూడా మాట్లాడుకోలేదు. ఇక బికినిలో ఇటీవల మరోసారి దర్శనమిచ్చిన ప్రగ్యా ఇండస్ట్రీలో ఫోకస్ అయ్యే ప్రయత్నం చేసింది. ఇటీవల కాలంలో గ్లామరస్ బ్యూటీలు సోషల్ మీడియాలోనే వారి ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటు దర్శక నిర్మాతల దృష్టిలో పడుతున్నారు. ఇక అఖండ లాంటి సక్సెస్ వచ్చాక కూడా ప్రగ్యాకు ఇలా చేయక తప్పడం లేదు. మరి ఈ లుక్స్ తో అయినా ఏవైనా ఛాన్స్ లు అందుకుంటుందో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment