శింబు నటించిన మానాడు 2021లో తమిళ సినిమాల్లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తమిళంలో విజయం సాధించడంతో, ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ దానిని తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. రీసెంట్‌గా రీమేక్ రైట్స్ కొనుగోలుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
ఇక మానాడు తెలుగు రీమేక్‌లో రానా దగ్గుబాటి నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమాలో రానా కాదు అతని తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి నటిస్తాడని ఇప్పుడు మరో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని అభిరామ్‌తో రీమేక్ చేయడానికి సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడని మరియు సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నాడని సమాచారం. మొత్తం నటీనటులు సిబ్బందిని ఖరారు చేసిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. కాగా, అభిరామ్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
Follow @TBO_Updates
Post a Comment