సంక్రాంతికి రాధేశ్యామ్, RRR సినిమాలు వస్తాయని అనుకుంటే ఏవేవో సినిమాలు వస్తున్నాయని ప్రేక్షకులు కొంత వరకు నిరాశగానే ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడగానే ఒక్కసారిగా ఫెస్టివల్ డేట్స్ కోసం పోటీ పడ్డారు. డేట్స్ అయితే బాగానే ఫిక్స్ చేసుకున్నారు కానీ ఆ తొందరలో అసలు సినిమాలు జనాల వరకు వెళతాయా లేదా అనేది ఎవరు పట్టించుకోవడం లేదు.
ప్రమోషన్స్ డోస్ పెంచక ముందే ఒకేసారి రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేశారు. నేడు విడుదలైన రానా 1945, అతిధి దేవోభవ గురించి కనీసం రిలీజ్ అన్నట్లుగా కూడా ఎవరికి తెలియదు. ఇక సంక్రాంతికి వచ్చే సినిమాలపై ఇంతవరకు బజ్ లేదు. దిల్ రాజు లాంటి నిర్మాత కూడా తన అన్న శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డితో చేసిన మొదటి సినిమా రౌడి బాయ్స్ ను కూడా సంక్రాంతి బరిలో దింపుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కూడా గ్యారెంటీ లేదు.
కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి, గల్లా అశోక్ హీరో కూడా ఇంతవరకు ఎలాంటి హైప్ క్రియేట్ చేయలేదు. ఒక్క బంగార్రాజు పై మాత్రమే కొంచెం హోప్స్ ఉన్నాయి కానీ టికెట్ల రేట్ల విషయంలో పరవలేదన్న నాగ్ ఏపీ లో 50% ఆక్యుపెన్సీ వస్తే బ్రేక్ ఈవెన్ కొట్టడం కూడా కష్టమే. పైగా ఏపీలో నైట్ కర్ఫ్యూలు కూడా అంటున్నారు. కావున మరో షో ఎగిరిపోతుంది. మరి ఈ క్లిష్ట సమయంలో సంక్రాంతికి ఏ సినిమా ఎంత వసూళ్ళు చేస్తూందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment