అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లా నాయక్. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఈ సినిమా ఎడిటింగ్ పార్ట్‌ను కూడా త్రివిక్రమ్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టాక్ ప్రకారం ఎడిట్‌లో అనేక మార్పులను కూడా సూచించాడని తెలుస్తోంది
భీమ్లా నాయక్ సినిమాకు మాటలు అంధించడమే కాకుండా మొదటి రోజు నుండి, త్రివిక్రమ్ ఈ చిత్రంలో చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించడంతో పాటు షూటింగ్ కు సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. రానా, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు అనవసరంగా ఉన్నాయని వాటిని డిలీట్ చేయడమే బెస్ట్ అని త్రివిక్రమ్ ఆ సీన్స్ ను లేపేసినట్లుగా తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment