నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుండి వారి విడిపోవడానికి అనేక కారణాలను పేర్కొంటూ అనేక వార్తా నివేదికలు ఆన్‌లైన్‌లో వెలువడ్డాయి. అయితే మొదట విడాకులు ఎవరు కోరుకున్నారు అనే విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వకపోగా ఇటీవల నాగార్జున వివరణ ఇచ్చినట్లుగా కొన్ని మీడియాలలో కథనాలు వేలువడ్డాయి.
సమంతనే మొదట విడాకులు కోరినట్లుగా నాగార్జున చెప్పారని కథనాలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదని నాగార్జున ఒక వివరణ ఇచ్చారు. 'సమంత & నాగచైతన్య గురించి నేను చేసిన ప్రకటన అంటూ సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం.. దయచేసి పుకార్లను వార్తలుగా పోస్ట్ చేయడం మానుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నాను..' అని నాగార్జున ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
Follow @TBO_Updates
Post a Comment