బాహుబలిని హిందీలో విడుదల చేసిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్‌తో అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. కరణ్ జోహార్ చాలా కాలంగా SS రాజమౌళితో వర్క్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కరణ్ జోహార్, ఎస్ఎస్ రాజమౌళితో సోలో చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నారట. ఇక ఇటీవలే అగ్ర దర్శకుడు అందుకు అంగీకరించినట్లు సమాచారం.
నూతన నటీనటులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఓ ప్రయోగాత్మకంగా యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందనుందట.
రాజమౌళి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇక కరణ్ జోహార్‌తో జక్కన్న ప్రాజెక్ట్ మహేష్ బాబు చిత్రం తర్వాత త్వరలో జరగవచ్చు. ఒకవేళ మహేష్ రాజమౌళిని వెయిటింగ్ మోడ్‌లో ఉంచితే, అగ్ర దర్శకుడు కరణ్ జోహార్ ప్రాజెక్ట్‌తో ముందుకు వెళ్తాడు. మరి రాజమౌళి తదుపరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment