రొమాంటిక్ సీన్స్ అంటేనే సినిమాలను రిజెక్ట్ చేసే అనుపమ పరమేశ్వరన్ ఏకంగా ముద్దు సీన్స్ తో రెచ్చిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ ముద్దు సీన్స్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించడంతో ఆమెకి చాలా లాభం చేకూరినట్లు తెలుస్తోంది.
దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక్కసారి కనెక్ట్ అయితే ఆ సంస్థలో నటీనటులకు దర్శకులను టెక్నీషియన్స్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. ఇక అనుపమ దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడి సినిమాలో ముద్దు సీన్ లో నటించడంతోనే సినిమాకు మంచి హైప్ వచ్చింది.
ఇక ఈ బ్యూటీ ఈ సినిమాకు కెరీర్ లోనే అత్యదిక పారితోషికం అందుకుందట. కోటి కూడా అందుకోలేని ఆమెకు రెండు కోట్ల వరకు రావడమే కాకుండా దిల్ రాజు భవిష్యత్తులో నిర్మించబోయే మరో రెండు ప్రాజెక్టులలో కూడా అవకాశం రానుందట. అంతే కాకుండా అనుపమ ఇలాంటి పాత్రలు కూడా చేస్తుందా అనే కొత్త ఇమేజ్ ను సంపాదించుకొని కొత్త తరహా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ బ్యూటీ ఇలాంటి క్రేజ్ ను ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment