మొత్తానికి పుష్ప సినిమాలో శ్రీవల్లి గా కనిపించి బిగ్ హిట్ అందుకున్న రష్మిక మందన్న రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న లిస్టులో సమంత రికార్డును కూడా ఆమె బ్రేక్ చేసినట్లు టాక్ వస్తోంది. పుష్ప అనంతరం సీక్వెల్ కు అంతకంటే ఎక్కువ అడిగే అవకాశం ఉందట.
పుష్ప సినిమా మొదటి భాగానికి రెండు కోట్ల వరకు అందుకున్న రష్మిక రెండవ భాగానికి మాత్రం అంతకంటే ఎక్కువగా 3కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఇక నిర్మాతలు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒక విధంగా సమంత రికార్డును బ్రేక్ చేసిన రష్మిక పుష్ప తరువాత నెంబర్ వన్ స్థానంలో ఉన్న పూజ హెగ్డే రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. బుట్టబొమ్మ ప్రస్తుతం 3.5కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇక రష్మిక ఆ స్థాయిలో ఎప్పుడు అందుకుంటుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment