దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా అందులో ఏదో ఒక పాయింట్ ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్, నాని తరువాత ధైర్యం చేసి మాట్లాడింది ఒక్క ఆర్జీవి మాత్రమే. పేదవాడి కష్టం సినిమా టికెట్ల వరకే వచ్చిందా? మిగతా విషయాల్లో పేదవాడికి కష్టం లేదా అని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
అయితే సినిమాలో ప్రశ్నించే మరికొందరు స్టార్ హీరోలు రియల్ లైఫ్ లో మాత్రం ఇంకా మౌనవ్రతంలో ఉండడానికి కారణం లేకపోలేదు. జస్ట్ చిన్న లాజిక్ అంతే. వ్యాపారులు, సెటిల్మెంట్స్ చాలానే ఉంటాయి కాబట్టి అంత ఈజీగా గెలకొద్దు అని అనుకుంటారు. అంతే కాకుండా తమ సినిమాలను ఆపేస్తారేమో అనేలా భయం కూడా ఉంటుంది. ఎవరికి వారు ఆలోచిస్తున్నారు కాబట్టే ఈ రోజు టికెట్ల రేట్లు సందిగ్ధంలో పడ్డాయి.
నాయకులతో సామరస్యంగా ఉండడంతో తప్పులేదు కానీ ఒక సినిమాను అడ్డుకుంటే మరొక సినిమా వాళ్ళు ఏమి పట్టనట్టుగానే ఉంటున్నారు. పోసాని లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే బండబూతులు తిట్టి కౌంటర్ ఇచ్చి దెబ్బ కొట్టానని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయనున్న ఇండస్ట్రీలోనే టికెట్ల రేట్లు తగ్గిపోతే కనీసం ఒక్క మాట కూడా రావడం లేదు. మన దగ్గర ఉన్న మిగతా స్టార్ హీరోలు కూడా మౌన వ్రతం వీడితేనే చిత్ర పరిశ్రమ సెట్టవుతుంది. లేదంటే నాయకులకు దండలు పెడుతూ సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Follow @TBO_Updates
Post a Comment