బాలీవుడ్ లోకి హరీష్ శంకర్?


దర్శకుడు హరీష్ శంకర్ దాదాపు రెండేళ్ల నుండి వెయిటింగ్ మోడ్‌లోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్‌ భవదీయుడు భగత్ సింగ్‌కి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. 2019లో గద్దలకొండ గణేష్‌కి దర్శకత్వం వహించిన తర్వాత, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం అయింది.  

ఇక హరీష్ శంకర్ త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడని తెలుస్తోంది.  హిందీలో దువ్వాడ జగన్నాథమ్ (డీజే) రీమేక్‌కు ఆయన దర్శకత్వం వహించనున్నారట. దిల్ రాజు ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఇక హరీష్ శంకర్ ఇటీవలే కొత్తగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడట. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.  యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ యువ బాలీవుడ్ నటుడు ప్రధాన పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇక  హరీష్ శంకర్ హిందీ ప్రేక్షకుల నేటివిటీని దృష్టిలో ఉంచుకుని వారి అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేసాడట. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అనంతరం ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.


Post a Comment

Previous Post Next Post