స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సొంతంగా కథ రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్, ధనుష్, అడివి శేష్ వంటి హీరోలు ఎవరికి వారు వారి ఇమేజ్ కు తగ్గట్టుగా నచ్చిన కథలను రాసుకుంటూ ఉండగా ఇప్పుడు అదే బాటలో అల్లు అర్జున్ కూడా వెళుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా బన్నీ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రైటర్ గా మారుతున్నాడట.
అల్లు అర్జున్ కు కథలపై అయితే మంచి కమాండ్ ఉందని చాలాసార్లు ఋజువయ్యింది. అతని సినిమాలు మాత్రమే కాకుండా ఇతర దర్శకుల కథలను కూడా జడ్జ్ చేస్తుంటాడు. ఇక బన్నీ ఇటీవల ఒక ఐడియాను కథగా మారుస్తున్నాడట. అవసరం అయితే తనకు సన్నిహితులుగా ఉన్న రైటర్స్ ఐడియాలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఇటీవల దుబాయ్ వెళ్లి అక్కడ ప్రశాంతంగా కొత్త తరహా కథ గురించి ఆలోచించినట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment