ప్రభాస్ సినిమా చేయడానికి కారణమిదే: థమన్


ఓకే సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం తనకు ఏ మాత్రం నచ్చడం లేదని, అలాంటి సినిమాలకు పని చేయాలని అనుకోవడం లేదని థమన్ ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి ఒకడితో శోభనం మరొకడితో అన్నట్లుగా ఉంటుందని చేస్తే మ్యూజిక్ BGM ఒక్కరే చేయాలనే విధంగా కూడా కౌంటర్ ఇచ్చాడు.

ఇక థమన్ ఇటీవల రాధేశ్యామ్ ఎందుకు ఒప్పుకున్నాడు అనే సందేహం రాగా ఆ విషయంలో ఒక వివరణ ఇచ్చారు.  రొమాంటిక్ డ్రామాలకు బిజిఎమ్ కంపోజ్ చేయగలనని అందరికీ నిరూపించాలనుకుంటున్నానని, ఈ చిత్రాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానని థమన్ చెప్పాడు.  థమన్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక రాధే శ్యామ్ మ్యూజిక్ స్కోర్‌ని ఎలా ఎలివేట్ చేసి ఇలాంటి సినిమాలకు కూడా న్యాయం చేయగలనని థమన్ నిరూపించాలని అనుకుంటున్నాడు.


Post a Comment

Previous Post Next Post