ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఐటెమ్ సాంగ్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక లైగర్ సినిమాలో కూడా ఐటెమ్ సాంగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే మామూలుగా ఉండవు. ఇక లైగర్ అనే పాన్ ఇండియా సినిమాలో కూడా అంతకు మించి అనేలా ఉంటుందని తెలుస్తోంది.
తనిష్క్ బాగ్చి అనే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు. ఇక సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం బాలీవుడ్ లోని ఒక స్టార్ హీరోయిన్ ను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండకు జోడిగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా మరో హాట్ బ్యూటీని ఐటెమ్ సాంగ్ కోసం రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారట. ఇక సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను మణిశర్మ అంధించనున్నారు.
Follow @TBO_Updates
Post a Comment