తల్లి కాబోతున్న కాజల్..!


టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న కాజల్ అగర్వాల్ గత ఏడాది చాలా సైలెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె తల్లి కాబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. ఆమె భర్త గౌతమ్ కిచ్లు సోషల్ మీడియా ద్వారా 2022 లో ఇలా చూడబోతున్న ట్లు చెబుతూ ప్రెగ్నెంట్ ఎమోజి ని కూడా జత చేయడం విశేషం.

మొత్తానికి కాజల్ ప్రెగ్నెంట్ కాబోతున్నట్లు గత కొంత కాలంగా వస్తున్న కథనాలకు క్లారిటీ వచ్చేసింది. ఇక కొన్నాళ్ళు కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ఆచార్య సినిమాలతోపాటు ఒక బాలీవుడ్ సినిమాను అలాగే మరో తమిళ సినిమాలు కూడా పూర్తి చేసింది. మరి కొన్ని ఆఫర్స్ ఉన్నప్పటికీ కూడా కాజల్ అగర్వాల్ ముందుగానే కిచ్లు కుటుంబానికి వారసుడు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుంది.

Post a Comment

Previous Post Next Post