మాస్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బోయపాటి శ్రీను ఇటీవల అఖండ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక బోయపాటి అఖండ సినిమాకు సీక్వెల్ ను మల్టీస్టారర్ గా తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉందని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక ఇటీవల బోయపాటి మరో యువ హీరో కోసం కూడా పవర్ఫుల్ కథను రాయడం స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ హీరో మరెవరో కాదు. రామ్ పోతినేని అని టాక్ వస్తోంది. గత రెండేళ్ల నుంచి బోయపాటి, రామ్ కాంబినేషన్ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక రామ్ ప్రస్తుతం ద వారియర్ అనే ద్విభాష చిత్రంలో నటిస్తుండగా ఆ సినిమా అనంతరం వీలైతే బోయపాటి సినిమాను సెట్స్ పైకి తీసుకు రావచ్చని సమాచారం. ఇక బోయపాటి అఖండ సీక్వెల్ కంటే ముందే ఆ ప్రాజెక్ట్ ఉంటుందని టాక్.
Follow @TBO_Updates
Post a Comment