మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బంగార్రాజు దర్శకుడు


దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 2022 సంక్రాంతి విజేతగా నిలిచాడు. ఈ దర్శకుడితో నాగార్జున, నాగ చైతన్య చేసిన  బంగార్రాజు థియేటర్లలో దూసుకుపోతోంది. ఇక ప్రముఖ తమిళ ప్రొడక్షన్ హౌస్, స్టూడియో గ్రీన్ అతని తదుపరి ప్రాజెక్ట్ కోసం ఫాస్ట్ గానే డీల్ సెట్ చేసింది. అధికారికంగా ప్రకటన కూడా చేశారు.  బంగార్రాజు విజయంపై కళ్యాణ్ కృష్ణను కెఇ జ్ఞానవేల్ రాజా కలుసుకుని అభినందించారు.

తెలుగు సంక్రాంతి బ్లాక్ బస్టర్ బంగర్రాజు డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణతో అతని తదుపరి భారీ సినిమా కోసం కలిసి వర్క్ చేయబోతున్నట్లు.. సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ఇక త్వరలోనే మరిన్ని వివరాలు వేలువడుతాయట. అలాగే కళ్యాణ్ కృష్ణ రానున్న రోజుల్లో మెగా హీరోలతో కూడా వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కలిగిన కళ్యాణ్ మెగాస్టార్ తో చాలా సన్నిహితంగా ఉంటాడట. ఇక త్వరలోనే ఆయనతో కూడా వర్క్ చేసే అవకాశం ఉంటుందని కళ్యాణ్ గత ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post