మెగాస్టార్ సినిమాలో మాస్ రాజా.. ఎంత సేపంటే?


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మాస్ మహారాజా ఒక పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో రవితేజ పాత్ర చాలా సేపు ఉంటుందట. మొదట  కేవలం 20 నిమిషాల క్యారెక్టర్ మాత్రమే ఉంటుందని టాక్ వచ్చింది. కానీ దర్శకుడు బాబీ ఆ పాత్ర నిడివిని మరింతగా పెంచినట్లు తెలుస్తోంది.

మొత్తంగా మెగాస్టార్ తో రవితేజ 40 నిమిషాలు కనిపిస్తాడని తెలుస్తోంది. అంటే దాదాపు ఇది మల్టీస్టారర్ అని కూడా చెప్పవచ్చు. మెగాస్టార్ తో అప్పట్లో అన్నయ్య అనే సినిమాలో తమ్ముడిగా కనిపించిన రవితేజ ఈసారి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో సమానంగా కనిపించనుండడం విశేషం. మరి ఆ పాత్ర సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకు వాల్తేరు వాసు అనే టైటిల్ సెట్ చేయాలనీ ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రాబోతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post