మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హిందీలో డబ్బింగ్ అయిన అల వైకుంఠపురములో విడుదలను ఆపడానికి బన్నీ వాసుతో సహా తన బృందంతో ఇటీవల ముంబైకి వెళ్లారు. కార్తీక్ ఆర్యన్‌తో హిందీలో ఇప్పటికే షెహజాదా అనే టైటిల్ తో రీమేక్ పనులు మొదలవ్వగా ఇప్పుడు అల.. వైకుంఠపురములో హిందీ సినిమాను విడుదల చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చర్చించారట.
హిందీలో AVPL విడుదలైతే షెహజాదా వ్యాపారానికి థియేట్రికల్ రన్‌కు నష్టం కలిగినట్లే. ఇక అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ వెర్షన్ జనవరి 26న విడుదల చేయాలని అనుకోగా.. ఇప్పుడు నిర్మాత అదే థియేట్రికల్ విడుదలను రద్దు చేశారు. ఇప్పటికే ఈ చిత్రం రీమేక్‌లో ఉన్నందున ఇప్పుడు డబ్బింగ్ విడుదలకు వెళ్లడం కరెక్ట్ కాదని అల్లు అరవింద్ హిందీ డబ్బింగ్ హక్కులు అందుకున్న గోల్డ్ మైన్ మనీష్‌ని ఒప్పించాడని సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment