Bangarraju @ Review


సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన బంగార్రాజులో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక హాస్యభరితమైన గ్రామీణ ఎంటర్టైనర్.  ఈ చిత్రంలో నాగ్, చైతన్యలకు జోడీగా రమ్యకృష్ణ, కృతిశెట్టి నటించగా..  ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, దర్శన బానిక్, సిమ్రత్ కౌర్ మరియు మీనాక్షి దీక్షిత్ అతిధి పాత్రల్లో కనిపించనున్నారు.  అనూప్ రూబెన్స్ అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి నాగార్జున బంగార్రాజు సినిమాను నిర్మించారు. ఇక నేడు జనవరి 14న విడుదలైన ఈ సినిమా  ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

 కథ: 
బంగార్రాజు సినిమా కథ సోగ్గాడే చిన్ని నాయనా ముగించిన చోట నుండి స్టార్ట్ అవుతుంది. స్వర్గం నుంచి నాగార్జున మళ్ళీ ఎప్పటిలానే భూమి మీదకు వస్తాడు.  అతని మనవడు చిన బంగార్రాజు (నాగ చైతన్య)కు తోడ్పడే విధంగా ఉండాల్సి వస్తుంది. ఇక చిన బంగార్రాజు శివపురం గ్రామానికి చెందిన ప్లేబాయ్ లా కనిపిస్తాడు. నాగ లక్ష్మి (కృతి శెట్టి)తో అతని లవ్ ట్రాక్ కోసం బంగార్రాజు రంగంలోకి వస్తాడు. ఇదిలా ఉండగా శివపురం ఆలయ సంపదపై కొందరు కన్నేస్తారు. ఇక చిన బంగార్రాజు అలాగే బంగార్రాజు (నాగార్జున) మళ్లీ భూమిపైకి వచ్చి ఏం వస్తాడు, చిన బంగార్రాజుకు వ్యక్తిగతంగా మరియు దుష్ట శక్తులకు వ్యతిరేకంగా అతను ఎలా సహాయం చేస్తాడు అనేది అసలు కథ..

విశ్లేషణ..

మొత్తానికి సినిమా సంక్రాంతి ఫెస్టివల్ లో విడుదలకు ముందే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ను అందుకుంది. దర్శకుడు కళ్యాణ్ కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్న నాయనా సినిమాకు కొనసాగింపుగా కథను అదే తరహా వాతావరణంలో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ తో పాటు కాస్త థ్రిల్ ఇవ్వాలని అనుకున్నాడు. కథలో కమర్షియల్ పాయింట్స్ కు ఎక్కువగా స్వేచ్ఛ ఉండడంతో చిన బంగార్రాజు కూడా బంగార్రాజు తరహాలోనే విలేజ్ ప్లే బాయ్ లాగా రెచ్చిపోయాడు. ఇక కథ నాగ చైతన్యను చిన్న బంగార్రాజుగా పరిచయం చేస్తూ ముందుకు సాగుతుంది.
బంగార్రాజు పల్లెటూరి సెటప్, పండగ వైబ్‌లు బాగానే ఉన్నా, సినిమాలోని అసలు సమస్య కూడా వెంటనే తెలిసిపోతుంది. సినిమాలో పెద్దగా ఆశ్చర్య పరిచే అంశాలు ఏమి లేవని ఫస్ట్ హాఫ్ తో క్లారిటీ వచ్చేసింది.

దర్శకుడు కేవలం కూల్ గా ఎంటర్టైన్మెంట్ అందించాలని ప్రయత్నాలు బాగానే చేశాడు. కానీ కొన్ని అంశాలు పరమ రొటీన్ గా అనిపిస్తాయి. కామెడీని బలవంతంగా ఇరికించారని అర్ధమవుతోంది. కేవలం కలర్ఫుల్ ఫ్రేమ్స్ సాంగ్స్ విజువల్స్ తప్పితే కథనంలో మాత్రం కిక్కు లేదు.
సెకండాఫ్ కూడా మొదటి తరహాలోనే సాగుతుంది.  
ఇక అభిమానుల కోసం రూపొందించిన కొన్ని మాస్ ఎలివేషన్స్ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా నాగచైతన్య ఎద్దు నుంచి ఒక చిన్నారిని రక్షించే సీన్ బావుంది. 
బంగార్రాజు ఫస్ట్ హాఫ్ చాలా యావరేజ్ గా అనిపిస్తోంది.  
ఇక సీనియర్లు నాగార్జున, రమ్యకృష్ణ తమ మ్యాజిక్ కాంబోతో క్లైమాక్స్ మళ్లీ ఓకే అనిపించింది.  

'నీ వెంటే వున్నా నేను ‘ పాట కుటుంబ నేపథ్యంతో చక్కగా ప్రజెంట్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్ పరవాలేదు అనేలా ఉన్నాయి. టెంపుల్ కు సంబంధించిన సన్నివేశాల్లో పాముకు సంబంధించిన సీన్స్ కూడా కాస్త థ్రిల్ ను కలిగిస్తాయి. ఫైనల్ గా ‘బంగార్రాజు’ అనేది రొటీన్ స్క్రిప్ట్, దీనికి రంగురంగుల పాటలు, నాగార్జున మరియు చై ప్రెజెన్స్ కొంతవరకు భర్తీ చేయబడ్డాయి. ఇక బాగా ప్రయత్నించిన కామెడీ నవ్వు తెప్పించలేదు, స్క్రిప్ట్‌లో ఎటువంటి తాజాదనం లేదు.  నాగ్, చై, రమ్యకృష్ణ తారాగణం సినిమాకి మరింత విలువనిస్తుంది. అయితే బాక్సాఫీస్ వద్ద బంగార్రాజు సంక్రాంతి సీజన్ బి, సి సెంటర్లలో కొంత వసూళ్లు రాబట్టవచ్చు.  అక్కినేని అభిమానులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

నటీనటులు..

సినిమా కోసం 2కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న కృతిశెట్టి బాగానే నటించింది గాని ఆమె పాత్రకు సంబంధించిన చాలా సీన్స్ మాత్రం రొటీన్ గానే ఉన్నాయి. యువ బంగార్రాజుగా నాగచైతన్య చాలా కలర్ఫుల్ గా కనిపించాడు. ఇక బంగార్రాజుగా నాగార్జున ఎప్పటిలానే ఆత్మ పాత్రలో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. రమ్యకృష్ణను నానమ్మ పాత్రలో కూడా చాలా బ్యూటీఫుల్ గా దర్శనమిచ్చింది. రావు రమేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ వంటి వారు వారి పాత్రలతో మెప్పించగా మిగతా నటీమణులు చూడలేని ఓవరాక్షన్ తో చిరాకు తెప్పించారు. 

ఇక టెక్నీకల్ టీమ్ గురించి మాట్లాడితే.. అనుప్ రూబెన్స్ పాటలతో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక పాటలను విజువల్‌గా బాగా చిత్రీకరించడంతో కొన్ని సాంగ్స్ క్లిక్కయ్యాయి.  సినిమాటోగ్రాఫర్ యువరాజ్ కలర్ఫుల్ ఫ్రేమ్స్ సినిమాకు మంచి వాతావరణం క్రియేట్ చేసింది.  పల్లెటూరి వాతావరణాన్ని మెయింటెన్ చేస్తూ అద్భుతంగా పనిచేశారు. విజయ్ వర్ధన్ కె ఎడిటింగ్ ఇంకా బంగుండాల్సింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమా కథనంలో మరింత పదును పెట్టి ఉంటే బావుండేది.  రచన పర్వాలేదు.

పాజిటివ్ పాయింట్స్
👉నాగార్జున
👉సాంగ్స్ విజువల్స్

మైనస్ పాయింట్స్..
👉ఉహాజనీతమైన కథ
👉రొటీన్ కామెడీ
👉స్క్రీన్ ప్లే

రేటింగ్2.75/5


Post a Comment

Previous Post Next Post