రెమ్యునరేషన్ లో బాలయ్య 50..?


నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. కేవలం థియేట్రికల్ గానే ఆ సినిమా 17కోట్లకు పైగా ప్రాఫిట్స్ అంధించినట్లు సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ గా ఓటీటీ హిందీ డబ్బింగ్ శాటిలైట్ ఇలా మరో 30కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చినట్లే. అంటే అఖండ సినిమాతో బాలయ్య నిర్మాతకు పెట్టిన పెట్టుబడులకు దాదాపు 45కోట్లకు పైగా లాభాలు అందించారు.

ఇక తరువాత రాబోయే సినిమాల విషయానికి వస్తే.. గోపిచంద్ మలినేని సినిమాతో పాటు సంపత్ నందితో కూడా సినిమా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇటీవల సంపత్ కూడా స్క్రిప్ట్ పూజ ముగిసినట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక అనిల్ రావిపూడితో సినిమా స్క్రిప్ట్ ఫినిష్ అవ్వాల్సి ఉండి. ఇక లిస్టులో మరొక బిగ్ ప్రొడక్షన్ తో కూడా కమిట్మెంట్ ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే బాలయ్య ఈ ఏడాది మరో మూడు సినిమాలకు సంతకం చేసి ఒక్కో సినిమాకు 12కోట్ల నుండి 15కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉందట. ఆ లెక్కలో మొత్తంగా 4 సినిమాలకి 50కోట్లకు పైగా  ఉంటుందని చెప్పవచ్చు.


Post a Comment

Previous Post Next Post